యూనివర్సిటీ లో ₹ 20 కోట్లతో  విద్యార్థులకు వసతి గృహాలు !

👉 మంత్రులు లక్ష్మణ్ కుమార్, ప్రభాకర్ గౌడ్ !

J SUREDER KUMAR,

శాతవాహన యూనివర్సిటీ లో 20 కోట్ల రూపాయల వ్యయంతో నూతన గిరిజన బాలుర ,బాలికల వసతి గృహాలకు  మంత్రులు
అడ్లూరి లక్ష్మణ్ కుమార్,పొన్నం ప్రభాకర్ తో కలిసి  గురువారం శంకుస్థాపన చేశారు

ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ,అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వకడే,  మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్ , జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ , సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి , వెలిచాల రాజేందర్ రావు  మరియు ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు.


👉 ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తలు శిక్షణ శిబిరం ప్రారంభం !

కరీంనగర్ DCC కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళన శిక్షణ కార్యక్రమాలు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మొదట సేవలాల్ మహారాజ్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ తరగతులు ప్రారంభించారు.