ఉపాధ్యాయులు నైపుణ్యముతో విద్యార్థులను తీర్చిదిద్దాలి !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మారుతున్న కాల పరిస్థితులకు అనుకూలంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతతో విద్యార్థులను తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ..

తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు. రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం  నిర్థిష్టమైన ప్రణాళికతో విద్య వ్యవస్థను ప్రతిష్టంగా తీర్చి దిద్దుతున్నారు అని అన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.


ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ₹ 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు.


ఏ టి సి సెంటర్లు మంజూరు చేసిందని దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అది పుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన ధర్మపురి కి చెందిన గొల్లపల్లి గణేష్ ను మంత్రి సన్మానించారు.

👉 పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ..

1962 లో ఉపాధ్యాయ దినోత్సవ ప్రారంభించారు. భారత దేశ ఉప రాష్ట్రపతి డా. సర్వేపల్లి జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుని దేశంలోని, రాష్ట్రం లోని అత్యుత్తమ ఉపాధ్యాయులను ఎన్నుకుని పురస్కారాలు అందిచడం జరుగుతుంది.


గురువును గౌరవించుకోవడం అంటే జ్ఞానాన్ని గౌరవించుకోవడం అని తెలిపారు. తండ్రి ఆస్తులు అందిస్తే గురువు జ్ఞానన్ని అందిస్తారు. జ్ఞానం నీ సంపద అయితే విజయం నీ బానిస అవుతుంది అని అన్నారు. అదే విధంగా అవినీతి లేని ఉత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని కొనియాడారు.


అనంతరం కెరీర్ గైడెన్స్ అనే పుస్తకం విద్యార్థుల భవిష్యత్ కు పునాది రాయిల ఉపయోగపడుతుంది అని ప్రతి ఒక్క ఉపాద్యాయుడు ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు
.

👉 కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.


.

డా సర్వేపల్లి అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలి-జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికవ్వాలి అని కలెక్టర్ అన్నారు.

డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేస్తూ, ఆయన సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ కోరారు. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు .


డా.సర్వేపల్లి రాధాకృష్ణ  తనకు వచ్చే వేతనంలో 75 శాతం వరకు పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అందించే వారన్నారు. *హెల్ప్ ఏజ్ ఇండియా* సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియా లో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు.


భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, విద్యావిధానం గొప్పదని తన రచనల్లో వివరించారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవా గుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఇప్పటికీ నిలిచిపోయేలా చేశాయని పేర్కొన్నారు. తనది మద్రాస్ రాష్ట్రమైన కూడా కలకత్తా ఇతర ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు.

ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని గుర్తు చేశారు. ఎక్కడ ఉన్నా కూడా పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.లత జిల్లా విద్యాధికారి కే. రాము, జిల్లా ప్రోగ్రాం అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, మరియు జిల్లా సమగ్ర శిక్ష కో – ఆర్డినేటర్ అధికారులు, వివిధ సంఘాల ఉపాధ్యాయ నాయకులు, మరియు సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.