J.SURENDER KUMAR,
ఈ నెల 9న, భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో 63శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 27 ప్రధాన రాజకీయ పార్టీలతో ఏర్పాటైన విపక్ష కూటమి( ఎన్ డి ఏ అలియాన్స్) అభ్యర్థి, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) మీట్-ది-ప్రెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ స్వాగతోపన్యాసం చేయగా, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మోడరేటర్ గా వ్యవహరించారు.


సుప్రసిద్ధ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి,

రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, బి. కిరణ్ కుమార్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, చిన్న మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబులతో పాటు జాతీయ, ప్రాంతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
