👉 యూరియా కోసం పార్లమెంట్ ముందు మా ఎంపీలు ధర్నాలు చేశారు !
👉 రాష్ట్రాలకు యూరియా పంపిణీ కేంద్ర ప్రభుత్వాన్నిదా ? కాదా ?
👉 రాజ్యసభలో యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఎంపీల పాత్ర ఏమిటి ?
👉 టిఆర్ఎస్ నమ్మిన వారిని నట్టేట ముంచే పార్టీ !
👉 తప్పుడు కేసులు పెట్టి వేధించడం టిఆర్ఎస్ పార్టీ నైజం !
👉 మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో యూరియా కొరత తీర్చడానికి, రైతుల కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రోటోకాల్ పక్కనపెట్టి సంబంధిత అధికారుల వద్దకు, కేంద్ర మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎక్కని గడపలేదు, కలవని మంత్రి లేడు అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
👉 మీడియా సమావేశ ముఖ్యాంశాలు..
👉 రాష్ట్రానికి తగినంత ఏరియా పంపిణీ చేయాలని కోరుతూ పార్లమెంట్ భవనం ముందు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధర్నా చేశారా? లేదా ?
👉 దేశంలో ని అన్ని రాష్ట్రాలకు యూరియా పంపిణి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నిగా కాదా రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం మంత్రులు రైతులకు సమాధానం చెప్పాలి .
👉 యూరియా సరఫరా ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని, బీజేపీ ఎంపీలు, మంత్రులు, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేదని మంత్రి మండిపడ్డారు.
👉 రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న బిఆర్ఎస్ ఎంపీలు యూరియా కోసం నోరు నోరు విప్పరా ? యూరియా విడుదల కోసం మీ ఎంపీల పాత్ర ఏమిటి ?
👉 “నమ్మిన వారిని నట్టేట్ల ముంచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. విమర్శలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి” .
👉 2014, నుంచి 2018,వరకు, 2018 నుంచి 2023 వరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాపై మా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేశారో, ( FIR ) ఎఫ్ఐఆర్ లతో చర్చకు నేను సిద్ధం .
👉 నేను ఎమ్మెల్యేగా గెలిచి విప్, మంత్రిగా ధర్మపురి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ధర్మారం, వెలగటూర్ ఎండపల్లి, పెగడపల్లి, గొల్లపల్లి ధర్మపురి పోలీస్ స్టేషన్లలో ఒక్క తప్పుడు కేసు పెట్టించిన ఎఫ్ ఐ ఆర్ (FIR) చూపించాలని మంత్రి డిమాండ్ చేశారు.
👉 2014లో ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ₹ 500 కోట్లు కేటాయిస్తానని మాటిచ్చి ఎందుకు ? ఇవ్వలేదు.
👉 ధర్మపురి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి వాగ్దానం చేసి దాన్ని మరిచారు.
👉 దళితులకు 3 ఎకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని 2018 మేనిఫెస్టోలో ప్రకటించి ఆ వాగ్దానాలను నెరవేర్చకపోవడం ప్రజలను మోసగించారు
👉 ధర్మపురి గోదావరి నీటిని సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించుకుంటూ వచ్చి, స్థానిక రైతుల కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మంత్రి దుయ్యబట్టారు. వెల్గటూర్ మండలంలోని 3 వేల వడ్డెర కుటుంబాల పొట్టలు కొట్టి, తరిమి వేశారు.
👉 “ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేశారంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. నిజమైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాం. కానీ మీ పాలనలో ఎప్పుడైనా ఒక్క ఇల్లు కట్టి ఇచ్చారా ?” అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
👉 ధరణి పథకం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రైతుల జీవితాలతో చెలగాటం ఆడిన వారికీ విమర్శించే అర్హత లేదని మంత్రి అన్నారు.
👉 ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల కు చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు చెల్లించకుండా నాతో కాదు అని చేతులు ఎత్తివేసింది నిజమా ? కాదా ? అని ప్రశ్నించారు.
👉 ఎల్లంపల్లి భూ నిర్వాసితుల బ్యాంకు ఖాతాలలో దాదాపు ₹17 కోట్ల రూపాయలు నేను గెలిచిన కొన్ని నెలలోనే జమ చేశానా ? లేదా ? అని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
👉 ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెలుగు కళాశాల నీ హాయంలో మూతపడితే తిరిగి తెరిపించడం నాతో కాదు అని చేతులు ఎత్తివేసావా లేదా ? అంటూ నిలదీశారు.
👉 బి ఆర్ఎస్ హాయంలో మూతపడిన తెలుగు కళాశాలలో నేను గెలిచిన కొన్ని నెలల్లోనే తెరిపించి కళాశాలలో విద్యాబోధన జరుగుతున్నదా ? లేదా ? అని మంత్రి సవాల్ చేశారు.
👉 వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మిల్లర్లతో కుమ్మక్కై మోసగించిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఒక్కో క్వింటలుకు 4-5 కిలోల చిటింగ్ జరిపారని ఆరోపించారు.
👉 “పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వని ఘనత మీ బీఆర్ఎస్ ప్రభుత్వానిది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి సన్నబియ్యం అందించడంతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేసింది” అని వివరించారు.
👉 అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి వర్గానికీ న్యాయం చేస్తూ, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
👉 రాబోయే రోజుల్లో ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, బస్సు డిపో, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ప్రకటించారు.
👉 “మేము ఒక్క మాట చెప్తే మీ బిఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా మిగలరు. మీ పార్టీకి చెందిన ఎంతో మంది ఇప్పటికే నాతో టచ్‌లో ఉన్నారు. వాటిని చెబితే మీరు తట్టుకోలేరు ఈశ్వరా” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా హెచ్చరించారు.