వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ !

👉 బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ !

J.SURENDER KUMAR,

విశ్వకర్మ జయంతి అనేది కళలు, శిల్పకళ, మరియు వాస్తుశిల్పానికి ప్రతీక. ఆయన సృష్టికర్త కాబట్టి, ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, చేతివృత్తులవారు, మెకానిక్‌లు, మరియు ఫ్యాక్టరీ కార్మికులు ఈ పండుగను గొప్పగా జరుపుకోవాలని  బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్, అన్నారు.


బుధవారం రోజున జగిత్యాల జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్  జి. నిరంజన్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..

నేటి ఆధునిక ప్రపంచంలో, ఇంజనీర్లు, యంత్రాల రూపకర్తలు, సాంకేతిక నిపుణులు విశ్వకర్మను ఆదర్శంగా భావించాలి. శారీరక శ్రమకు, సృజనాత్మకతకు, మరియు వృత్తిపరమైన నైపుణ్యానికి గౌరవం ఇవ్వాలని మన పనిలో విజయం సాధించడానికి విశ్వకర్మ ఆశీస్సులు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బిఎస్ లత, బి. రాజా గౌడ్, బిసి సంక్షేమ అధికారిణి జి. సునీత మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.