👉 మంత్రి డి.శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని ప్రాంతంలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు.

మంథని మున్సిపాలిటీలో ₹80 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలో ఎంపిపిఎస్ బాలికల పాఠశాల లో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…..
పేదలకు నాణ్యమైన విద్య అందాలని స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విద్య, వైద్య రంగాలలో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుతో పాటు పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో టీచ్ ఫర్ చేంజ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సమాజంలో మంచి జర జరగాలని నిస్వార్ధంగా కృషి చేస్తున్న మంచు లక్ష్మికి అభినందనలు తెలిపారు.

విద్యా రంగంలో అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. విద్యతో విజ్ఞానం వస్తుందని, బాగా చదువుకున్న తర్వాత నాయకులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు.
మంథని నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు.
👉 కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పటు చేస్తూ పిల్లలకు మెరుగైన బోధన అందించేందుకు సహకారం అందిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ సంస్థ స్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు డిజిటల్ తరగతులను, మూడు సంవత్సరాల వరకు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అందించే కరికులం ను సద్వినియోగం చేసుకుంటూ పిల్లల్లో మంచి మార్పు తీసుకుని రావాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని, అవసరమైన పాఠశాలల్లో ప్రహరీ గోడ, అదనపు తరగతులు, టాయిలెట్స్ అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టామని అన్నారు.
👉 టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ప్రతినిధులు ప్రముఖ నటులు మంచు లక్ష్మి మాట్లాడుతూ….
మంథని లో 6 తరగతి గదులను డిజిటలైజ్ చేయడం జరిగిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం మా సంస్థ ద్వారా 51 తరగతి గదులలో డిజిటల్ సౌకర్యాలు కల్పించామని అన్నారు.

తమ కుటుంబ నేపథ్యం విద్య రంగం నుంచి వచ్చిందని, తమ తాతగారు హెడ్ మాస్టర్ గా పని చేసేవారని తెలిపారు. మంచి నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
పిల్లలు మంచి నాయకత్వ లక్షణాలు, జీవితంలో ఒక మంచి లక్ష్యం కలిగి ఉండాలని అన్నారు. పిల్లలు అందరూ డాక్టర్లు, ఇంజనీర్ కలెక్టర్ వంటి పెద్ద స్థాయికి చేరుకోవాలని అన్నారు. మా సంస్థ సహకారంతో ఇక్కడి పాఠశాలల్లో మంచి మార్పులు వస్తే మరిన్ని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ముందుకు వస్తామని అన్నారు.

👉 205 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ :
అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ , మంథని రామగిరి కమాన్ పూర్ మండలంలో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని, ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న, ఆర్.డి.ఓ. సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.