విద్యార్థులకు యూకే ప్రభుత్వ స్కాలర్‌షిప్ లు ఇవ్వండి!

👉 చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్  కో-ఫండింగ్ ప్రాతిపదికన…

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్ విషయంలో కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలన్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సూత్రప్రాయంగా ఆంగీకరించారు.

👉 భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ జూబ్లీహిల్స్ నివాసంలో గురువారం ముఖ్యమంత్రి తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. వారితో పాటు డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్  కూడా ఉన్నారు.

👉 యూకే ప్రభుత్వం అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా అందిస్తున్న చెవెనింగ్ స్కాలర్‌షిప్ లను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణకు చెందిన మెరిట్ విద్యార్థులకు అందించడానికి ఈ సందర్భంగా అంగీకరించారు. విద్య, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కి వివరించారు.

👉 యూకేలోని యూనివర్సిటీల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి వర్సిటీలు అడ్మిషన్లు, ఇతరత్రా కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి  కోరారు. తెలంగాణలో కొత్తగా తీసుకురానున్న ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా గురించి ముఖ్యమంత్రి  బ్రిటిష్ హైకమిషనర్ కు వివరించారు. 

👉 రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించడానికి లిండీ కామెరాన్  సుముఖత వ్యక్తం చేశారు. 

👉 అలాగే, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని, ప్రధానంగా జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ సెంటర్లు, వివిధ అకాడమీలకు సంబంధిత రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి  విజ్ఞప్తి పట్ల బ్రిటిషన్ హైకమిషనర్  సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.