విద్యార్థులకు రాగి జావా అందించడం అభినందనీయం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగి జావా పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ  పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం “బెల్లంతో కూడిన రాగి జావా” పోషణ కార్యక్రమాన్ని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…


శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా  రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నది అని అన్నారు. దాదాపు 16.2 లక్షల మంది విద్యార్థులకు రాగి జావా అందజేస్తుండగా, ఇందులో 40 శాతం ఖర్చును ప్రభుత్వం, 60 శాతం ట్రస్ట్ భరిస్తోంది. జగిత్యాల జిల్లాలోనే 50 వేల మంది విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నామన్నారు.


విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రాగి జావా ఎంతో మేలు చేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ పానీయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటాం” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


అనంతరం వనమహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, జిల్లా విద్యాధికారి కే.రాము, మండల విద్యాధికారి సీతాలక్ష్మి, అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధులు పీవీఆర్కె శాస్త్రి, నరేష్ మహదేవ్, కొమురయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.