విద్యుత్ పంపిణీ వ్యవస్థలో మార్పులు చేపట్టాలి!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత మూడో డిస్కంపై ముందుకు వెళ్లాలని అన్నారు.

👉 ఇందన శాఖపై ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఇంధన శాఖ, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో మంగళవారం రాత్రి సుదీర్ఘంగా  సమీక్షించారు. మూడవ డిస్కం ఏర్పాటుకు వీలైనంత తొందరగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని, సంబంధిత పీపీఏ అలొకేషన్, సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  అధికారులకు పలు సూచనలు చేశారు.

👉 రాష్ట్రంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (TGSPDCL) , నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (TGNPDCL) లతో పాటు మరో డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలపై ఇంధన శాఖ సిద్ధం చేసిన ప్రాథమిక ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.

👉 వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలను వివరించారు.

👉 గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై పలు ప్రతిపాదనలు, డీపీఆర్ తయారీకి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి కి వివరించారు. వీటితో పాటు కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లను అధునీకరించే అంశాలను తెలియజేశారు.

👉 వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

👉 కోర్ అర్బన్ రీజియన్‌లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలి.

👉 ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్మెంట్ చర్యలు చేపట్టాలి.

👉 సబ్ స్టేషన్ సామర్థ్యంకన్నా ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

👉 అవసరమైన చోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

👉 విద్యుత్ సబ్ స్టేషన్‌లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి.

👉 విద్యుత్ కేబుళ్లతో పాటు ఇతర కేబుళ్లు సైతం అండర్ గ్రౌండ్ వ్యవస్థను ఉపయోగించుకునేలా ఉండాలి.

👉 దీనిపై బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలి.
వచ్చే డిసెంబర్‌లోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలి.

👉 రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన ప్రణాళికలు  సిద్ధం చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.

👉 ఈ సందర్భంగా అధికారులు కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మోడల్ సోలార్ రూఫ్ టాప్ విలేజ్ పనుల వివరాలను తెలియజేశారు.

👉 ఇందిరా సోలార్ గిరి జల వికాసం ద్వారా రైతులకు సోలార్ పంప్ సెట్లను అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు కంటైనర్ బేస్డ్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా మహిళా రైతులకు సోలార్ విద్యుత్ తో పాటు వారికి ఆదాయం అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు

👉 రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, భవనాలను సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భవనాలు, పాఠశాలల సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు.

👉 పునరుత్పాదక విద్యుత్ తయారీలో వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆహ్వానించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలతో పాటు, బడ్జెట్ అంచనాలను రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ఆదేశించారు.