👉 ఆలయ నిర్వాహకులను అభినందించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ !
J.SURENDER KUMAR,
తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయంలో భక్తులకు అందుతున్న సేవలపై ఆలయ బోర్డును కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. ఈ మేరకు ఆదివారం యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు ఆయన రాసిన లేఖ చేరింది.
కెనడాలోని ఒట్టవా నగరంలో గల శ్రీ లక్ష్మీ నరసింహా దేవాలయంలో ఇటీవల జరిగిన స్వామి వారి కళ్యాణం జరిగిన తీరుతెన్నులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతిలోని విభిన్నత… ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కెనడాలోని హిందూ భక్తులను ఐక్యంగా చేస్తూ దైవ సంబంధిత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

కాగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకటరావు హర్షం వ్యక్తం చేశారు. స్వామి వారి సేవలను రానున్న రోజుల్లో మరింత భక్తులకు అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.