ఎన్నికల నియమావళి నిబంధనలను తప్పకుండా పాటించాలి !

👉 రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని !

👉 ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష !

J SURENDER KUMAR,

ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్, జిల్లా కలెక్టర్ లతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో లు, ఎంపిడివో లు,మున్సిపల్ కమీషనర్ లు లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. 

ఎంపీటీసీ జడ్పీటీసీ  రెండు  విడతలు గా ఎన్నికలు  జరుగుతాయి, సర్పంచ్  ఎన్నికలు  కూడా రెండు  విడతలు  గానే నిర్వహస్తారు అని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే ప్రాంతాలలో అమలులోకి రావడం జరుగుతుందని అన్నారు. ఎం.సి.సి. నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలని అన్నారు.

ఓటర్లను ప్రభావితం చేసేలా, ఎంసిసి నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో, సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ గౌతమ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిణి మదన్ మోహన్, జిల్లా నోడల్ అధికారులు, ఎంపిడివో లు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.