అధికారులే మిల్లర్లతో మాట్లాడాలి !

👉 వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్!


J.SURENDER KUMAR,

రైతులు మిల్లర్లతో మాట్లాడుకోవాలని ఎవరు చెప్పినా అది తగదు. మిల్లర్లతో మాట్లాడే బాధ్యత అధికారులదే. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది, అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శుక్రవారం ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ….


రైతులు కష్టపడి పండించిన వడ్లను ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.


పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి  అన్నారు. సన్న వడ్ల కొనుగోలు కూడా జరుగుతుందని, రైతులకు ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా , మీ అన్నగా నాదే బాధ్యత, అని మంత్రి  లక్ష్మణ్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు.