👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అమెరికాలో జరిగిన కాల్పుల్లో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి ఆదుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుమార్ బాధిత దళిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ కుటుంబాన్ని మంత్రి ఆదివారం ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధిత విద్యార్థి తల్లికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిభావంతుడు ఇలా దుండగుల చేతిలో మృత్యువాత పడటం ఎంతో బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇదివరకే మాట్లాడినట్లు తెలిపారు. చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇందుకోసం అమెరికా ఎంబసీ అధికారులతో, భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయంతో సి ఎస్ స్థాయి లో నిరంతర సమన్వయం జరుగుతోందని చెప్పారు. అమెరికా ప్రభుత్వ స్థాయిలో పూర్తి స్థాయి విచారణ జరగాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ప్రతిభావంతుడైన తెలుగు యువకుడు దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం. ఈ కష్టసమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మీ వెంటే నిలుస్తుంది,” అని మంత్రి కుటుంబానికి భరోసా ఇచ్చారు. చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని మంత్రి ఆకాంక్షించారు.