భార్యా బాటలో భర్త మల్లోజు వేణుగోపాల్ లొంగుబాట!


J.SURENDER KUMAR,

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లు జిల్లా వేణుగోపాల్ @ అభయ్ @  తన 46 ఏళ్ల అజ్ఞాత జీవితం వీడి మంగళవారం మహారాష్ట్ర గడిచిరోలి పోలీసుల ముందు 60 మంది మావోయిస్టులతో లొంగిపోయి భార్య బాటలోనే భర్త లొంగుబాటు జరిగింది.

మల్లోజు వేణుగోపాల్ భార్య జనవరి2025లో మహారాష్ట్ర సీఎం ఫండవీస్ ముందు తనతోపాటు 12 మంది మావోయిస్టులతో లొంగిపోయింది.

మల్లోజు వేణుగోపాల్ భార్య తారక మహారాష్ట్ర సీఎం ముందు లొంగుబాటు(ఫైల్ ఫోటో)

వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన భార్య తారక దళ కమాండర్ గా కొనసాగింది. ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్లో 66 కేసులు నమోదయి ఉన్నాయి. ఆయుధాలతో లొంగిపోవడం సంచలనంగా మారింది.

గత ఆగస్టు మాసం నుండి మల్లోజుల వేణుగోపాల్ సైతాంతిక విభేదాలతో ఆయుధాలు వీడుదాం శాంతి చర్చలు తదితరాంశాలతో విడుదల చేసిన 22 పేజీల లేఖలో తన ఫోటో ఈమెయిల్ ఐడి పెట్టడం సంచలనంగా మారింది.
మల్లోజు వేణుగోపాల్ లొంగుబాటు భార్య బాటలో మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోతాడని ఉప్పు ముందస్తుగానే వార్తా కథనం ప్రచురించింది