బీసీల పోరాటానికి మద్దతు తెలిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BC బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మద్దతు తెలిపి వారితో కలసి పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బిసి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు శనివారం గొల్లపల్లి మండల కేంద్రంలోని BC సంఘాల ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, బీసీ సంఘాలకు పూర్తి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం బీసీ వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తుందని, 42% రిజర్వేషన్ సాధన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
ర్యాలీలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నరు.

👉 ధర్మపురిలో బంద్ విజయవంతం !

స్థానిక సంస్థల్లో  బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం   తెలంగాణ రాష్ట్ర బంద్ కు బీసీ ఐకాస చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల  శ్రీనివాస్ గౌడ్  ఇచ్చిన పిలుపు మేరకు
అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్ లో పాల్గొన్నారు విద్య, వ్యాపార సంస్థలు అన్ని వర్గాలు  స్వచ్చంధంగా బంద్ పాటించాయి.

బీసీ నేత జాజాల రమేష్ బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు కూర్మచలం ఉమామహేశ్  బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు  స్తంభం కాడి శ్యాం బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు బోగ రమేష్ లు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అన్ని వర్గాలతో కలసి  నినాదాలతో బైక్ ర్యాలీ చేసి అంబేద్కర్  విగ్రహనికి పూల మాల వేసి బంద్ లో పాల్గొన్నారు

👉 నాయకులు మాట్లాడుతూ..

రాష్ట్ర బంద్ తో గల్లి నుండి డిల్లీ దాకా సెగ పుడుతుందని బీసీ రిజర్వేషన్ల పెంపుతో అన్ని కులాలకు రాజకీయ ప్రతినిత్యం పెరుగుతుందని బిసిలకు జనాభా దామాషా ప్రకారం అధికారంలో వాటా దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  బీసీ సంఘాల నేతలు, MRPS నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలు వేముల రాజేష్, పిల్లి శ్రీనివాస్, సంగి శేఖర్, చిపిరిశెట్టి రాజేష్, సంగ నర్సింహులు ,మొగిలి శేఖర్, రాందేని మొగిలి, కుమ్మరి  తిరుపతి, స్థంభంకడి మహేష్, ఉప్పల రామక్రిష్ణ, చందోలి శ్రీనివాస్, బిసగోని శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు