👉 మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ !
J.SURENDER KUMAR,
స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనలో భాగంగా ఈ నెల 18 న జరగబోవు తెలంగాణ రాష్ట్ర బందును జయప్రదం చేయండి. అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటనలో పిలుపునిచ్చారు.
అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఐక్యమై ఆరెస్సెస్ – బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా గట్టి ప్రజాందోళనను చేపట్టాలి అని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ను కోరుతూ శాసన సభలో బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించింది. తరువాత ఒక ఆర్డినెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తదుపరి GO 9ని విడుదల చేసింది. మనది ఫెడరల్ రాజ్యాంగం. దీని ప్రకారం రాష్ట్రాలకి అధికారాలు ఇవ్వబడ్డాయి.
రాష్ట్ర పరిధిలో విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు చేసుకునే అధికారం ఉన్నది. స్థానిక సంస్థల విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. ప్రభుత్వం బుసాని వెంకటేశ్వర్ రావు కమిషన్ రిపోర్ట్ (మార్చ్ 2025) ప్రకారం జీఓను విడుదల చేసింది అని పేర్కొంది.

ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలసి కేంద్రానికి వ్యతిరేకంగా న్యాయపరంగానూ, చట్టాన్ని తెచ్చేందుకు పోరాడాల్సి ఉంటుంది.
పార్లమెంట్ లో చట్టం ద్వారా ఈ సమస్య పరిష్కారం ప్రధానంగా అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కలసి ఈ సమస్య పూర్వా పరాలను ప్రజలకు అర్ధం చేయించి గట్టి ప్రజాందోళనను చేపట్టటం ద్వారానే ఈ డిమాండ్ ను సాధించుకోగలుగుతాము అంటూ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు.