భక్తి భావం కోసం కృషి చేయడం అరుదైన విషయం!

👉 మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

నిత్యం ప్రజా సమస్యలతో, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీ బిజీగా కొనసాగే రాజకీయాలలో యువత , విద్యార్థి లోకం, ప్రజలలో ఆధ్యాత్మిక భక్తి భావం కలిగించడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయం అరుదైన సాంప్రదాయమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచన కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..

ధర్మపురి క్షేత్రం భాగవత పురాణాలకు, వేద విద్యలకు సనాతన సాంప్రదాయాల నిలయం అన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ కు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో  ధర్మపురి క్షేత్రంలో ప్రవచనం చెప్పించాలి అని ఆలోచన రావడం రాజకీయ నాయకులకు చాల అరుదయిన విషయం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
రాజకీయాలు కు అతీతంగా ఈ కార్యక్రమం చెయ్యాలి, ధర్మపురి క్షేత్రం అభివృద్ధి కావాలి అని అలోచించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంత్రి లక్ష్మణ్ కుమార్ భక్తి భావానికి నిదర్శనం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.