చాగంటి కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తజనం ?

👉 చాగంటి రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం  క్యాబినెట్ ప్రోటోకాల్ పాటించాల్సిందే !

J SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ప్రారంభం కానున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తజనం తరలిరానున్నట్టు చర్చ మొదలైంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ హోదా తో ప్రభుత్వ సలహాదారుగా 2024 లో నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం చాగంటి రాక సందర్భంగా ప్రోటోకాల్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. 

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకపు ఉత్తర్వుల(ఫైల్ ఫోటో)

హంగు ఆర్భాటాలకు ఆమడ దూరంలో ఉండే చాగంటికి  పట్టింపులు లేకున్నా, నిబంధనలు యంత్రాంగం విధిగా పాటించాల్సిందే. పత్రికలలో ప్రచార సాధనాలు, సోషల్ మీడియాలో చాగంటి కార్యక్రమానికి విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి భక్తులు తరలిరానున్నారు.


ధర్మపురి క్షేత్రంలో వాహనాల క్రమబద్ధీకరణ, పార్కింగ్ స్థలాలు, తాత్కాలిక వాష్ రూమ్ లు, అవసరమైన చోటు విద్యుతికరణ, అదనపు పోలీసు బలగాలు ప్రత్యేకంగా మహిళ పోలీసులు, వాహనాల రాకపోకలకు వన్ వే తదితర అంశాలతో పాటు, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ సేవలు అందుబాటులో  ఉండాలనే చర్చ నెలకుంది.

👉 శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు జారీ చేసిన చాగంటి షెడ్యూల్ వివరాలు !

ఈనెల 11 న (శనివారం) మధ్యాహ్నం 1-00 గంటలకు ధర్మపురి క్షేత్రానికి రానున్నారు.
మొదటి రోజు కార్యక్రమమం సాయంత్రం 6-00 గంటల నుండి రాత్రి 8-00 గంటల వరకు
క్షేత్రంలోని బ్రాహ్మాణ సంఘం ప్రక్కన గల శ్రీశ్రీశ్రీసచ్చిదానంద సరస్వతి స్వామి వారి శ్రీమఠం స్థలంలో.


👉 రెండవ రోజున..

12 న ఆదివారం రోజున ఉదయం 8-00 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం
సాయంత్రం 6-00 గంటల నుండి రాత్రి 8-00 గంటల వరకు అదే స్థలంలో ప్రవచనం !

👉 డాక్యుమెంటరీ ప్రోమో విడుదల!

మంత్రి కుమారుడు హరిశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన ” ధర్మపురి ఆలయ డాక్యుమెంటరీ ”  ప్రోమోను, చాగంటి కోటేశ్వరరావుచే  విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా వేదికపైకి ప్రభుత్వ యంత్రాంగం జారీ చేసిన  గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.
దాదాపు పదివేల మందికి పైగా భక్తులు తరలివస్తారని యంత్రాంగం అంచనా వేస్టు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.