చాగంటి ప్రవచనాలు ప్రచార మాధ్యమాల్లో  ప్రశంసలు !

👉 మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు నెటిజన్లు అభినందనలు !

👉 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురి !

J.SURENDER KUMAR,

ఈనెల 11, 12 తేదీ లలోబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధర్మపురి క్షేత్రంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలో దేశంలో వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ధర్మపురి క్షేత్ర వాసులు చాగంటి ప్రవచనాలలో నీతి నిజాయితీ ధర్మబద్ధంగా జీవనం కొనసాగించడం, భక్తి భావం, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి  క్షేత్ర  ప్రాశస్యత  తదితర అంశాలు పేర్కొనడంతో ప్రశంసల జడి వానకురిపిస్తున్నారు.

సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్, చాగంటి కోటేశ్వరరావు ధర్మపురి క్షేత్రానికి ఆహ్వానించడానికి గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్, కాకినాడ ఆయన గృహంలో కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు చాగంటి కోటేశ్వరరావు అంగీకరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, భూపాల్ పల్లి నిజామాబాద్ జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.


ప్రవచనం వినడానికి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్,. తదితర ప్రముఖులు తరలివచ్చారు. ఇదే వేదికపై మంత్రి తనయుడు హరీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వైభవం డాక్యుమెంటరీ ప్రోమోను విడుదల చేశారు.

👉 బ్రహ్మశ్రీ చాగంటి తన ప్రవచనంలో ముందుగా..

పూర్వజన్మ సుకృతం ఉంటేనే, ఈ క్షేత్రంలో అడుగుపెట్టే మహా అదృష్టం మానవులకు ఉంటుందని, అలాంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో అడుగుపెట్టే అదృష్టం నాకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్పించాడు అని నేను భావిస్తున్నాను. నా జన్మకు ఇంతకంటే మహాభాగ్యం ఏదీ లేదు అని, ప్రవచన చక్రవర్తి  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో అన్నారు.

👉 ధర్మపురి క్షేత్రానికి ధర్మానికి అనుసంధానం !

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు  ప్రవచనంలో ప్రధానంగా ధర్మం గురించి ప్రస్తావిస్తూ, ధర్మాన్ని ధర్మపురికి అనుసంధానం చేస్తూ, ముఖ్యంగా ధర్మపురి వాసుల అదృష్టం గుర్తు చేస్తూ ధర్మబద్ధంగాజీవనం తో యమధర్మరాజు బారిన పడకుండా నిత్యం నరసింహ నామ స్మరణ తో  తరించాలని శనివారం ధర్మపురి వేదికగా భక్తులందరికీ  ఆధ్యాత్మిక  ప్రవచనంలో వివరించారు.

👉 భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు…

ఈ క్షేత్ర వాసి మహాకవి శేషప్ప తన శతకంలో భగవంతుడు ఏదో రూపంలో ఉన్నాడు అని  నిరూపించాడు అంటూ చాగంటి వివరించారు.

👉” అడవి ప్రక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చెను.. మృగ జాతికి ఎవ్వడు మేత పెట్టే… స్త్రీల గర్భమున శిశువును ఎవ్వడు పెంచే ….?  వన చరదులకు భోజనం ఎవరు ఇచ్చే…?   జీవకోట్లను పోషింప నీవే కానీ వేరే దాత లేదయ్య వెతికి చూడ.. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాసం దుష్ట సోమవారం నరసింహ దురితదూర ”

** ఓ నరసింహస్వామి అడవిలోని పక్షులకు ఆహారము, మృగజాతికి ఎవడు మేత .. చెట్లకు ఎవడు నీళ్లు పోసి పెంచె.. స్త్రీల గర్భములో శిశువులను ఎవరు పెంచారు..  పశువులకు పచ్చ గడ్డి పెట్టి పోషించింది ఎవ్వడు.. అతడే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దాత తప్ప మరొకరు లేరు ఉండరు అంటూ శేషప్ప శతకంలోని భావమును చాగంటి తన ప్రవచనములో సులభ శైలిలో భక్తులకు వివరించారు.**

👉 ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అతి ప్రాచీన అపూర్వ ఆలయాల్లో ఒకటి !

కుటుంబ సభ్యులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

👉 చాగంటి మాటల్లో.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనార్థం ఇక్కడికి వచ్చాను, అపూర్వ ఆలయాల్లో ఆలయాల్లో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి..

మనిషికి దీర్ఘాయుష్షు ఉంటే ఏ కార్యమైనా చేయవచ్చు. దీర్ఘాయుష్ లోని ప్రతి బంధకాలు తొలగించడానికి సాక్షాత్తు యువధర్మరాజు ఇక్కడ కొలువై ఉండడం, అపూర్వ దేవాలయాలలో అరుదైన ఆలయం ఇది ఒకటి.

👉 యోగ ఆనంద భరితమైన భంగిమలుస్వామి వారు తన రెండు చేతులు తొడల పై పెట్టుకొని పక్కన లక్ష్మి, ఆదిలక్ష్మి కొలువై ఉన్నారు.

👉 ధర్మపురి ఆలయానికి ఎనిమిదిక్కుల హనుమాన్ స్వామి వారిని సేవిస్తూ ఆలయానికి రక్షణగా ఉన్నారు.

👉 ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి, పాలకవర్గం  స్వామివారి దర్శనం కోసం నా పట్ల ప్రదర్శించిన ప్రేమానురాగాలు నా హృదయం సంతోషంతో నిండిపోయింది.

👉 లోక కళ్యాణార్థం స్వామివారికి నిత్యం, జరిగే అభిషేకాలు, పూజలు, హోమాలు, కళ్యాణం, భరణి నక్షత్రంలో యమధర్మరాజుకు అభిషేకాలు, హోమాలు  జరిగే ఈ ఆలయంకు నిత్యం ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ధర్మ మార్గంలో పయనించాలని విజ్ఞప్తి చేశారు.

👉సామాన్యుడిలా చాగంటి కోటేశ్వరరావు రాక !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదా గల ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సామాన్యుడిలా తన కుటుంబ సభ్యులతో కలిసి 16 సీట్లు గల వాహనంలో ధర్మపురి కి చేరుకున్నారు. ఎలాంటి కాన్వాయ్  పోలీస్ బందోబస్తు వాహనశ్రేణి లేకుండా, ఆయన ధర్మపురి పోలీస్ షర్టు పరిధిలోకి రాగానే రూట్ మ్యాప్ కోసం  ఒకే ఒక పోలీస్ వాహనం ఆయన వ్యాన్ ముందు దారి చూపుతూ వచ్చింది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శనివారం పగలు ధర్మపురికి చేరుకున్నారు.  ఆయనకు, వేద పండితులు, మహిళలు, ఆలయ అర్చకులు శ్రీలక్ష్మీ నర సింహ స్వామి పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో పాటు, మహిళలు మంగళహారతులతో  ఘన స్వాగతం పలికారు


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ రూటే సపరేట్ !

ధర్మపురి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సాగు, తాగు, విద్యా వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు తన రాజకీయ రూట్  సపరేటుగా ఆధ్యాత్మిక , ఆలయాల అభివృద్ధి, వేద సదస్సుల నిర్వహణ, భగవంతుడు ముందు అందరూ సమానమే అంటూ  ఆలయంలో తనకు ప్రోటోకాల్ స్వాగతాలు వద్దన్నారు.  గత సంవత్సరం జరిగిన వేద సదస్సుకు తన ఎమ్మెల్యే నెల జీతం దాదాపు ₹ 2 లక్షల 60 వేలు, విరాళంగా ఇచ్చారు.

దసరా నవరాత్రి ఉత్సవాలలో  శత చండి పారాయణం, భోజనాలు, ముక్కోటి, స్వామి వారి కళ్యాణ ఉత్సవాలలో సమయపాలన పాటించాలని, ఆలయానికి వీఐపీల రాక కోసం అర్చకులు ఎదురు చూడవద్దన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ వేదిక  విశాల మైదానంలో ఏర్పాటు చేయడం.

ఆలయంలో నిత్య అన్నదాన భక్తుల సంఖ్య పెంచడం, అర్చకుల వేద పండితుల, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, స్వామివారి పల్లకి మోసే బోయిల పారితోషికం పెంచడం.

కోట్లాది రూపాయల నిధులతో ఆలయ అభివృద్ధి పనులు  కోసం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి రామ శైలజ అయ్యంగార్ తో ధర్మపురిలో సమీక్షా సమావేశం నిర్వహించడం తదితర ఆధ్యాత్మిక ఎజెండాతో మంత్రి లక్ష్మణ్ కుమార్, రాజకీయ జీవనంతో పాటు ఆధ్యాత్మిక  దిశలో పయనిస్తున్నారు.

👉 శృంగేరి స్వామిని ఆహ్వానించిన మంత్రి !

శృంగేరీ జగద్గురు శ్రీశ్రీ విధుశేఖరభారతీమహాస్వామి ధర్మవిజయయాత్ర-2025 సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి రావాల్సిందిగా మంత్రి లక్ష్మణ్ కుమార్, శృంగేరి ఆస్థాన పండితులు, ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తో గత వారం రోజుల క్రితం శృంగేరి పీఠానికి వెళ్లి స్వామివారిని ధర్మపురి క్షేత్రానికి రావలసిందిగా అభ్యర్థించార