J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ (SPCA) కి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్, లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆవిష్కరించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి , హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ , సీజీజీ డీజీ రవి గుప్త , ఎస్పీసీఏ చైర్మన్ జస్టిస్ బి. శివశంకర్ రావుతో పాటు ఇతర సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 సదర్ సమ్మేళనం !

హైదరాబాద్‌లో జరగనున్న సదర్ సమ్మేళనంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ నెల 19 వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళన్‌లో పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
👉 ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పరామర్శ !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావును బుధవారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైద్యులతో మాట్లాడి, ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.