కాంగ్రెస్ నేత సంజీవ్ మృతి తీరనిలోటు మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్ ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా జూలపెల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గండు సంజీవ్  గుండెపోటుతో  మృతి చెందారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయరమణరావు శనివారం కాచాపూర్ గ్రామానికి చేరుకుని గండు సంజీవ్ మృతదేహానికి దేహానికి  నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గండు సంజీవ్  కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.