కాంగ్రెస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ వాళ్లకు పదవులు ఇస్తారా ?

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి !

J SURENDER KUMAR,

దశాబ్దాల కాలంగా కష్ట కాలం నుండి  కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో బిఅరెస్ నాయకులకు పదవులు ఇస్తారా ? కాంగ్రెస్ లో వలసవాదులకు పట్టం కడితే,  మేము పట్టాదారులం ఎటు పోవాలి అంటూ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మపురి లోని మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంప్  కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి  బీర్పూర్ మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో వచ్చి బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ నియామకం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు.


దశాబ్ద కాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వ నికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి నామినేటెడ్ పదవి ఎలా ఇస్తారు అంటూ జీవన్ రెడ్డి మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తుంటే పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో బిఅరెస్ నాయకులకు పదవులు ఇస్తున్నారు, కాంట్రాక్టు పనులు కానీ  ఏది అయిన బిఅరెస్ వారికి కట్టబెడుతున్నారు, ఎవరు ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు బిఅరెస్ నాయకులకు ఇచ్చారు అని అన్నారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా ఎవరో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడుకి దేవస్థానం చేర్మెన్ పదవి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సహదారులకు కమిటీలో స్థానం కల్పించారు అని వివరాలు వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏమిటి ?  మేము  రాహుల్ గాంధీ అడుగు జాడలలో నడుస్తున్నాం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అంటూ ముందుకు పోతున్నాం అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసదారుల లాగా మేము దోచుకోవడానికి, దాచుకునే వారిమి కాదు  కాంగ్రెస్ నాయకులం అని అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి పట్టదారులం, కౌలు దారులం కాదు, వలసదారుల ముందు మేము తలవంచం అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 అధిష్టానం కు వ్యవస్థ మంత్రి లక్ష్మణ్ కుమార్ !

పెద్దలు వ్యక్తం చేసిన సంఘటనలు, సందర్భాలు, కార్యకర్తల ఆవేదన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు వివరిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వివరిస్తూ, మీరు పెద్దలు అంటూ  జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.