కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ పార్టీ !

👉 జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత మైనార్టీ వర్గాల సంక్షేమం అభ్యున్నతికి అండగా ఉంటూ వారి కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను మద్దతుగా మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని అంబేద్కర్ నగర్, తవకల్ నగర్ లో మంత్రి  లక్ష్మణ్ కుమార్ , పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

👉 ప్రచార సభలలో మంత్రి   లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  అలాగే ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూబ్లీహిల్స్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కష్టం వచ్చినా తామందరం అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఓటర్లకు మంత్రి  హామీ ఇచ్చారు.

నవీన్ కుమార్ యాదవ్ సేవా దృక్పథంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎవరికి  ఏ ఆపద  ఉన్న అన్నివేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్న  వ్యక్తిగా గుర్తింపు కలిగి ఉన్నాడని అన్నారు.


ఓటర్లు  కాంగ్రెస్ పార్టీ హస్తం  గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.