ధర్మపురి ఆలయ అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తున్నారు !

👉 ప్రముఖ ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు !

J.SURENDER KUMAR,

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ  అభివృద్ధి కోసం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎనలేని పట్టుదలతో కృషి చేయడంతో పాటు ప్రజలు, అర్చకులు, వేద పండితులు, పాలకవర్గం, మంత్రి కుమారుడు ఎనలేని కృషి చేస్తున్నారని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

👉 అనంతరం చాగంటి మీడియాతో మాట్లాడుతూ. ..

శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శనార్థం ఇక్కడికి వచ్చాను, అపూర్వ ఆలయాల్లో ఆలయాల్లో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి..

👉 మనిషికి దీర్ఘాయుష్షు ఉంటే ఏ కార్యమైనా చేయవచ్చు. దీర్ఘాయుష్ లోని ప్రతి బంధకాలు తొలగించడానికి సాక్షాత్తు యువధర్మరాజు ఇక్కడ కొలువై ఉండడం, అపూర్వ దేవాలయాలలో అరుదైన ఆలయం ఇది ఒకటి.

👉 యోగ ఆనంద భరితమైన భంగిమలుస్వామి వారు తన రెండు చేతులు తొడల పై పెట్టుకొని పక్కన లక్ష్మి, ఆదిలక్ష్మి కొలువై ఉన్నారు.

👉 ధర్మపురి ఆలయానికి ఎనిమిదిక్కుల హనుమాన్ స్వామి వారిని సేవిస్తూ ఆలయానికి రక్షణగా ఉన్నారు.

👉 ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి, పాలకవర్గం  స్వామివారి దర్శనం కోసం నా పట్ల ప్రదర్శించిన ప్రేమానురాగాలు నా హృదయం సంతోషంతో నిండిపోయింది.

👉 లోక కళ్యాణార్థం స్వామివారికి నిత్యం, జరిగే అభిషేకాలు, పూజలు, హోమాలు, కళ్యాణం, జరిగే ఈ ఆలయంకు నిత్యం ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ధర్మ మార్గంలో పయనించాలని విజ్ఞప్తి చేశారు.

👉 దేశం, రాష్ట్రాలు, సుఖశాంతులు తో ఉండాలని స్వామివారిని ప్రార్థించిన చాగంటి తెలిపారు.