ధర్మపురి డాక్యుమెంటరీ ప్రోమో విడుదల చేసిన చాగంటి!

J SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్ర వైభవం ప్రపంచవ్యాప్తంగా దశ దిశల వ్యాప్తి చెందాలని చిత్రీకరించిన ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వైభవం డాక్యుమెంటరీ ప్రశంసనీయం అభినందనీయమని ప్రముఖ ప్రవచక కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
ధర్మపురి లో జరుగుతున్న చాగంటి కోటేశ్వరరావు
ఆధ్యాత్మిక ప్రవచన వేదికపై ఆదివారం రాత్రి  మంత్రి లక్ష్మణ్ కుమార్ తనయుడు హరీశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వైభవం డాక్యుమెంటరీ ప్రోమో చాగంటి కోటేశ్వరరావు విడుదల చేశారు.

ఈకార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ప్రముఖ ప్రవచకులు శ్రీ శృంగేరి పీఠ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, వేద పండితులు అర్చకులు తదితరులుపాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ..

ధర్మపురి క్షేత్ర అభివృద్ధి, విస్తృత స్థాయి ప్రచారం కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ హైదరాబాదులో, కాకినాడకు సామాన్యుడిలా వచ్చి ధర్మపురి క్షేత్రంలో ప్రవచనం కోసం ఆహ్వానించడం నేను ఆయనలోనే భక్తి భావానికి చెల్లించిపోయానని చాగంటి అన్నారు. తన మోకాళ్లకు శస్త చికిత్స అయిందని ఆరోగ్యం కుదుట పడగానే తప్పక వస్తానని చెప్పానన్నారు.

చిన్న వయసులో అంతటి భక్తి భావన, నన్ను ధర్మపురి కి రావలసిందిగా, తన ఆధ్వర్యంలో చిత్రీకరణ జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైభవం లఘు చిత్రం ( డాక్యుమెంటరీ) విడుదల చేయాల్సిందిగా మంత్రి కుమారుడు హరీశ్వర్ కుమార్ విజ్ఞప్తితో నేను చలించిపోయానని చాగంటి అన్నారు.


ధర్మం, సంస్కృతి, మన సంస్కారాల ప్రాధాన్యత, కుటుంబ విలువలు మరియు ఆధ్యాత్మికతపై  చాగంటి  స్ఫూర్తిదాయక ప్రవచనం చేశారు.