👉 ఈనెల 11, 12 రెండు రోజులపాటు ప్రవచనాలు !
J . SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈనెల 11,12 తేదీలలో ప్రముఖ ప్రవచనకర్త మరియు ఆధ్యాత్మిక గురువు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రానున్నారు.

గత రెండు నెలల క్రితం సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆలయ అధికార యంత్రాంగం, పాలకవర్గ చైర్మన్ కాకినాడ లో చాగంటి కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.