👉 ఈనెల 11, 12 తేదీలలో ప్రవచన కార్యక్రమం!
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో ఈనెల 11,12 న జరగనున్న ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు ప్రవచన కార్యక్రమానికి ఆలయాధికారులు పాలకవర్గం విస్తృత ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత రెండు నెలల క్రితం స్వయంగా కాకినాడలో వారి ఇంటికి వెళ్లి ధర్మపురి క్షేత్రానికి రావలసిందిగా ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానం మేరకు
ఈనెల 11మరియు 12 రెండు(2) రోజులు ధర్మపురి క్షేత్రములో ప్రవచన కార్యక్రమము నిర్వహించుటకు చాగంటి కోటేశ్వరరావు సమ్మతించారు.సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.

శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి శ్రీమఠం స్థలములో వారి అనుమతితో నిర్వహించనున్నారు. ప్రవచన కార్యక్రమాన్ని ప్రత్యక్షముగా తిలకించుటకు స్థానిక ధర్మపురి ప్రజల తో పాటు పరిసర గ్రామాల, పట్టణాల నుండి నిత్యం సుమారు 10 నుండి 15 వేల మంది భక్తులు వచ్చే అవకాశము ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మైదానం చదును చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.