ధర్మపురిలో కన్నుల పండువగా పూర్ణాహుతి !

👉 పూర్ణాహుతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

దసరా నవరాత్రోత్సవములలో భాగంగా  బుధవారం (10వ) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపములలో భక్తులకు దర్శనం ఇచ్చినది. ధర్మపురి క్షేత్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని హోమశాలలో పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కుటుంబ సభ్యులు పూర్ణాహుతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయము, వేదపండితులు, ఋత్వికులచే మహ సంకల్పము, పృద్వీకలశ, గణపతి పూజ, స్వస్తిఃపుణ్యహ వచనము, ఋత్విక్ వర్ణణము, అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, అంకురారోపణ, మాతృక, సర్వతోభద్ర మండల పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము, అమ్మ వారికి చతుషష్టి పూజ, శ్రీచక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, ఐదుగురు ఋత్వికులచే “చండీపారాయణం”  “దేవిభాగవత పారాయణం”, కన్యకా, సువాసిని పూజలు జరిగాయి.  మరియు చండీహోమం, బలిహరణ, వూర్ణాహుతి కార్యక్రమములు నిర్వహించారు.

అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆర్థిక సహాయంతో స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వేదపండితులు   బొజ్జ రమేష్ శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, సిహెచ్. ముత్యాల శర్మ, ఋత్వికులు  భరత్ శర్మ,  దుద్దిల్ల నారాయణ శర్మ,  అలువాల కృష్ణ శర్మ,  తాడూరి బలరాంశర్మ,  పాలెపు చంద్రమౌళిశర్మ, ఉపప్రధాన అర్చకులు  నేరళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు  నంబి శ్రీనివాసాచార్యులు, అర్చకులు  ద్యావళ్ళ విశ్వనాథ శర్మ అభిషేక పురహితులు  బొజ్జ సంపత్ కుమార్,  బొజ్జ రాజగోపాల్ శర్మ ఋత్వికులు  నంబి అరుణ్ కుమార్,  పాలెపు సందీప్ శర్మ, ద్యావళ్ళ సాయి శర్మ లు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి  సంకటాల శ్రీనివాస్, తో పాటు సూపర్డెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ , ఆలయ పాలకవర్గ అధ్యక్షులు, సభ్యులు, జక్కు రవీందర్,  ధర్మకర్తలు,  ఎదులాపురం మహేందర్,  బాదినేని వెంకటేష్, బొల్లారపు పోచయ్య,  గుడ్ల రవీందర్,  కొమురెల్లి పవన్ కుమార్,  మందుల మల్లేష్,  నేదునూరి శ్రీధర్,  రావర్తి సాయికిరణ్, శ్రీ స్థంభంకాడి గణేష్  సంబెట తిరుపతి, శ్రీమతి వొజ్జల సౌజన్యతో పాటు, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారికి షోడషోపచార పూజతో హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి.


అనంతరం స్థానిక న్యూ టీటీడీ లో నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం లో   మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారి దర్శించుకున్నారు.