ధర్మపురి లో వైభవంగా విజయదశమి వేడుకలు!

👉 శమీ పూజలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి క్షేత్రంలో గురువారం విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ధర్మపురి పట్టణ శివారు శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయ దారిలో ని జంబి గద్దె వద్ద జరిగిన  శమీ పూజలో  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


ముందుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సాహమూర్తులు మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, వేద పండితులు, అర్చకులు, వేద పఠనం తో దాదాపు కిలోమీటర్ దూరాన ఉన్న జమ్మి గద్దె మండపం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నాయి.

మండప స్థల దాత స్వర్గీయ శీలం పెద్ద గంగారం కుటుంబ సభ్యులు, శీలం రమేష్ దంపతులను మండపం వద్ద అర్చకులు, వేద పండితులు ఘనంగా ఆశీర్వదించి స్వామివారి వస్త్రాన్ని ఆలయ పక్షాన బహుకరించారు.


జమ్మి వృక్షం వద్ద స్వామివారి కి వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయ సూచికంగా పోలీస్ అధికారులు తుపాకీతో గాలిలో కాల్పులు జరిపారు. అనంతరం వేలాదిమంది భక్తులు జమ్మి చెట్టు ఆకులను తెంపుకున్నారు.

స్వామివారి ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా అంబేద్కర్ విగ్రహం, పుష్కర స్తూపం, బస్టాండ్, గాంధీ చౌక్, నుండి ఇసుకస్తంభం మండపానికి చేరుకుంది. వేలాదిమంది భక్తజనం ఉత్సవమూర్తుల ఊరేగింపు వెంట గోవింద నామస్మరణలతో తరలి వెళ్లారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, స్వామివారి సేవ పల్లకిని మోశారు. ఉత్సవమూర్తుల సేవ (పల్లకి) వెంట మంత్రి లక్ష్మణ్ కుమార్, భక్తులతో పాటు ఇసుక స్తంభం మండపం ఆలయం వరకు కలసి నడిచారు.

👉 మహిషాసుర సంహారం !

స్థానిక బస్టాండ్ వద్ద ఆలయ పక్షాన ఏర్పాటుచేసిన మహిషాసుర బొమ్మను నిర్వహణ అధికారి ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ బాణాసంచా తో కాల్చారు.

👉 పల్లకి బోయిలకు నగదు బహుకరణ !

వంశపార్యం పరంగా స్వామివారి సేవ పల్లకిని మోసే బోయులకు ( బెస్త వారికి ) మంత్రి లక్ష్మణ్ కుమార్ ₹ 45 వేల నగదును వారికి అందించారు. గత సంవత్సరం ₹ 20 వేలు ఇచ్చారు. ఇటీవల దేవాదాయ శాఖ నుండి వీరి వేతనం పెంపుదలకు ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మపురి నియోజకవర్గ ప్రజానికానికి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.