👉 చాగంటి ప్రవచనాలు పరవశించిన పరవశించిన భక్త జనాలు!
J.SURENDER KUMAR,
శ్రీరాముని చేత ప్రతి ష్ఠించిన సైకత లింగం (శివలింగం) విష్ణుమూర్తి స్వరూపమైన సృసింహుడు ఒకే చోట కొలువై ఉండటం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దివ్యరామం ధర్మపురి అని, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కుజపర మైన వైవాహిక సమస్యలు తొలగిపోతాయని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.
ధర్మపురిలో శ్రీ మఠం మైదానంలో ఆదివారం బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని ఆలకించడానికి ప్రముఖ ప్రవచకుడు, శ్రీ శృంగేరి పీఠ ఆస్థాన పండితుడు, డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ , మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, కూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు. పాల్గొన్నారు.

👉 స్వయంభు అగ్నిహోత్రుడు ఇక్కడ !
అతి ప్రాచీన అపూర్వ ఆలయాల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యాగశాలలో అగ్నిహోత్రుడు స్వయంభుగా వెలసిన అపూర్వ అరుదైన విగ్రహం దేశంలో ఎక్కడా లేదని చాగంటి అన్నారు.


👉 నరసింహ తత్వం !
దర్శం, సంస్కృతి, కుటుంబ విలువలు. నారసింహ తత్వం, ప్రహ్లాదుడి భక్తి తదితర విషయాలపై వివ రించారు.
ప్రతి ఒక్కరు గురువును పూజించాలని, గురువు ద్వారా సన్మార్గం కలుగుతుందని, ధర్మాన్ని వీడిన వ్యక్తులను భగవంతుడు క్షమించడని వివరించారు యువత, విద్యార్థి లోకం, ప్రజలు ప్రతి ఒక్కరూ నీతి, నిజాయతీ, సేవాభావం, ధర్మ ప్రవర్తన పెంపొందించుకోవాలని చాగంటి అన్నారు.