👉 తెలుగు వర్సిటీ-2023 సాహితీ పురస్కారం!
J.SURENDER KUMAR,
ధర్మపురికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ప్రముఖ సంస్కృత పండితుడు నరహరి శర్మకు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికి సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు.
తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాల్లో ఉత్తమ గ్రంథాలకు2023 సంవ త్సరానికి గాను దాదాపు పది రచనలకు సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవిత అంశంలో వొజ్జల నరహరిశర్మ, రచించిన ధర్మపురి వైభవం ను ఎంపిక చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ లో ₹ 20,116 నగదుతోపాటు పురస్కారాలతో సన్మానించనున్నారు.