J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ధర్మపురి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక నంది చౌరస్తా లో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంపిణీ చేశారు.
👉 ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి ప్రజలకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తన మాట నిలబెట్టుకుని ఈరోజు ఆ హామీని నెరవేర్చారని వారు వివరించారు.
ఈ ప్రాంత యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంలో ఈ కళాశాల మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ధర్మపురి విద్యార్థులకు గొప్ప విద్య వరం లభించిందని అన్నారు.
“ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మంత్రి అడ్లూరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన ప్రతి హామీని క్రమంగా నెరవేర్చుతూ ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తున్నారు” అని అన్నారు. సంబరాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.