దసరా వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం
కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దసరా వేడుకలు జరుపుకున్నారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ స్వగ్రామం చేరుకున్న సీఎంకు గ్రామస్తులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మనవడితో కలిసి శమీ వృక్షం వద్ద పూజలు చేశారు.