గిరిజన శాఖకు ఆది కర్మయోగి అభియాన్ అవార్డులు!

J SURENDER KUMAR,

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కు
ఆధి కర్మ యోగి అభియాన్ జిల్లాలు ఐ.టి.డి.ఎలు అవార్డులు లభించాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం & ఉట్నూర్ జాతీయ అవార్డులకు గుర్తింపు పొందాయి.


పద్మ పి.వి., డాక్టర్ ఎ. కీర్తి & డాక్టర్ జి. నరేందర్ రెడ్డికి అత్యుత్తమ కృషికి ప్రత్యేక గుర్తింపు పొందింది.  తెలంగాణలో సమగ్ర గిరిజన అభివృద్ధి & అంతర్గత శాఖల సమన్వయానికి ఒక నిదర్శనం.
“ఆది కర్మయోగి అభియాన్” జాతీయ సమావేశంలో భారత రాష్ట్రపతి చేత అత్యుత్తమ ప్రదర్శనకు ప్రశంసలు పొందింది.

గిరిజన సంక్షేమ మంత్రి  లక్ష్మణ్ కుమార్ తో పాటు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, అదనపు డైరెక్టర్ విట్టా సర్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ వి. సముజ్వల మరియు డెప్యూటీ డైరెక్టర్ పద్మ పి.వి. ముఖ్యమంత్రి .అనుముల రేవంత్ రెడ్డిని గురువారం కలిశారు  సి.ఎం. వారి అంకితభావం మరియు కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలును ప్రశంసించారు.

👉 పి.ఎం-జన్‌మన్: తెలంగాణ టాప్ 3 రాష్ట్రాలలో ఒకటి !

👉 డి.ఎ జె.జి.యు.ఎ: కమ్యూనిటీ పాల్గొనడంలో జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్