గిరిజనుల ధైర్యం క్రమశిక్షణ నైపుణ్యానికి ప్రతిబింబం!

👉 దేశంలో మొదటిసారిగా ఈ కేనో స్ప్రింట్ పోటీలు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

కెనో స్ప్రింట్ వంటి క్రీడలు గిరిజనుల సహజ ధైర్యం, క్రమశిక్షణ, నైపుణ్యానికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలు గిరిజన సంప్రదాయ క్రీడా వారసత్వాన్ని కాపాడడమే కాకుండా, యువతకు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తాయి అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ సరస్సులో మూడు రోజులపాటు జరిగిన గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్–2025 శుక్రవారంతో ముగిసాయి. ఈ పోటీలు జంజాతీయ గౌరవ వర్షే లో భాగంగా నిర్వహించారు ముగింపు వేడుకకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, క్రీడల శాఖ మంత్రి  వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

👉 తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు హృదయపూర్వక అభినందనలు విజేతలు, రన్నర్‌లతో పాటు పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి అభినందనలు.

👉 ఈ రకమైన జాతీయ క్రీడా కార్యక్రమాలు యువతలో పోటీ భావన, క్రమశిక్షణ మరియు ఐక్యతను పెంపొందిస్తాయి, అని నిర్వాహకులు, కోచ్‌లు, జడ్జీలు, అధికారులు, వాలంటీర్లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

👉 ఈ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాల గిరిజన క్రీడాకారులు పాల్గొనడం ‘బిన్నత్వంలో ఏకత్వం’ అనే భారతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు.

👉 తెలంగాణ గిరిజన శాఖ ఆధ్వర్యంలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ అభివృద్ధి దశలో ఉందని, దీన్ని మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

👉 ఇండియన్ కయాకింగ్ & కెనోయింగ్ అసోసియేషన్ సహకారంతో క్రీడా శిక్షణా అవకాశాలు విస్తరణ దిశగా కృషి జరుగుతోందన్నారు.

👉 గిరిజన సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడా క్యాలెండర్‌లో చేర్చే లక్ష్యంతో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌ను భగవాన్ బిర్సా ముండా  150వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తికి నివాళిగా నిర్వహించామన్నారు.

👉 భగవాన్ బిర్సా ముండా ఆత్మస్ఫూర్తి గిరిజన ఐక్యతకు మార్గదర్శిగా నిలుస్తుంది
గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్–2025 తెలంగాణ రాష్ట్రం ఘనంగా నిర్వహించిన చారిత్రాత్మక జాతీయ క్రీడా వేడుకగా నిలిచింది, అన్నారు.

👉 ఈ వేడుకను గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ (TCR&TI) గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించింది.స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (SATS) మరియు ఇండియన్ కయాకింగ్ & కెనోయింగ్ అసోసియేషన్ కృషికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

👉 వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న గిరిజన యువ క్రీడాకారులు దేశ గర్వకారణం అని పేర్కొన్నారు.
ఈ జాతీయ క్రీడలు గిరిజన సంప్రదాయాన్ని మరియు ఆధునిక అభివృద్ధిని కలిపే వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు.

👉 ఈ క్రీడలు గిరిజన జీవన విధానంలో అంతర్భాగం ఆ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ గిరిజన సాధికారత, విద్య, ఉపాధి, సంస్కృతి, క్రీడా అభివృద్ధి పట్ల కట్టుబడి ఉంది అన్నారు.

👉 గిరిజన ఆశ్రమ, గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తు గిరిజన గౌరవం, ఐక్యత, క్రీడాస్ఫూర్తి — ఈ ఛాంపియన్‌షిప్ నిజమైన ప్రతీక అన్నారు.

👉 భగవాన్ బిర్సా ముండా స్ఫూర్తితో సమగ్ర, సమాన, స్వాభిమాన భారతం నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మనమంతా కలసి గిరిజన గౌరవం, అభివృద్ధి, ఐక్యత కోసం ముందుకు సాగుదాం, అని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

👉 ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి అవకాశం కల్పించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా మంత్రిగా కృషి చేస్తున్నానని ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని విద్యార్థులాంతా అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

👉 ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ

తెలంగాణలో ఒక్క ప్లేయర్ పదిమంది ప్లేయర్లతో సమానమన్నారు. వివిధ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన గొప్ప క్రీడాకారులు మన రాష్ట్రంలో ఉన్నారన్నారు

👉 క్రికెట్ ప్లేయర్ సిరాజ్, బాక్సింగ్ ప్లేయర్ నికితా జరీన్ల ప్రతిభ గుర్తించి డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు.

👉 తెలంగాణ రాష్ట్రమంతా జనాభా కలిగినా దక్షిణ కొరియా దేశం ఒలంపిక్స్ లో 36 గోల్డ్ మెడల్స్ సాధించింది.అలాంటిది 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించాలి? అని అన్నారు.


👉 2036 ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి కృషి చేస్తుందన్నారు

👉 కృషి,  నిరంతర శ్రమ, క్రమశిక్షణ ఉంటే..  క్రీడా రంగంలో  ఉన్నత స్థాయికి చేరేందుకు మార్గం ఉంటుందన్నారు.

👉bముఖ్యమంత్రి  దిశానిర్దేశంలో రూపొందిన క్రీడా పాలసీ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తోంది. జాతీయ స్థాయి పోటీల్లో 9 రాష్ట్రాల నుండి వచ్చిన 150 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణం అన్నారు.


👉 క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రీడా రంగం పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

👉 విజేతల వివరాలు !

ఈ పోటీలలో తెలంగాణ జట్లు అత్యధిక పతకాలు గెలుచుకొని ఓవరాల్ ఛాంపియన్‌గా ప్రధమ స్థానంలో నిలిచాయి. అస్సాం రెండవ స్థానం, మహారాష్ట్ర మూడవ స్థానం సాధించాయి.

విజేతలకు మరియు రన్నర్ అప్ రాష్ట్రాల జట్లకు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి బహుమతులు ప్రదానం చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్వహించిన ఈ జాతీయ కెనో స్ప్రింట్ రేసుల్లో తెలంగాణ రాష్ట్రం విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మంత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ట్రైబల్ వెల్ఫేర్ విద్య శాఖ అధికారులు సముజ్వల, సర్వేశ్వర రెడ్డి, సత్యనారాయణ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.