గోదావరి హారతి  స్థల పరిశీలించిన కోకన్వీనర్ రామ్ సుధాకర్ !

J.SURENDER KUMAR,

పవిత్ర కార్తీకమాసంలో ధర్మపురి లోని గోదావరి నది తీరంలో నవంబర్ 9 న అత్యంత వైభవంగా నిర్వహించబోయే గోదావరి మహా హారతి స్థల పరిశీలన శనివారం చేశారు.

గోదావరి మహా హారతి ఏర్పాట్ల కోసం శనివారం గోదావరి హారతి కమిటీ సభ్యులతో కో కన్వీనర్ రామ్ సుధాకర్ రావు సమావేశం నిర్వహించారు.


గోదావరి నది తీరంలో హారతి వేదిక ఏర్పాట్ల గురించి మరియు వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాల గూర్చి చర్చించి బాధ్యతల అప్పగించారు. సమావేశానికి ముందు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రామ్ సుధాకర్ రావు పరామర్శించారు.