👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
హరీష్ రావు నీవు , నీ బావమరిది, కెసిఆర్ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకొని స్టువర్ట్‌పురం దొంగలకు మించిన బంధి పోట్లు కాబట్టి మీరే దండుపాళ్యం ముఠా నాయకులు అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం మందుల సామ్యెల్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్ యాదవ్ లు మాట్లాడారు మాట్లాడారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో కామెంట్స్ !
దళితులు, బలహీన వర్గాలు ఉన్న క్యాబినెట్‌ను అవమానపరచడం సిగ్గుచేటు, ఇది కేవలం ప్రభుత్వాన్ని కాదు, తెలంగాణ దళితులను అవమానపరచడం.
👉 సిద్ధిపేట దేవాలయంలో చర్చకు సవాల్ విసిరినప్పుడు రానని తోక ముడిచావు, హరీష్ రావు ధైర్యం ఉంటే, మళ్లీ రా ప్రజల ముందే చర్చిద్దాం !
👉 దళితుల మీద తుపాకులు పెట్టి బెదిరించిన రోజులు గుర్తున్నాయా హరీష్ రావు ?నేడు తెలంగాణ ప్రజలు భయపడే రోజులు లేవు. మేము కేసీఆర్ లాంటి వెన్నుపోటు రాజకీయాలు చేయం.నేను కాంగ్రెస్ జెండా, ప్రజా విశ్వాసం మీద నిలబడిన వాడిని.
👉 హరీష్ రావు ఎమ్మెల్యేలకు ఫండ్ ఇవ్వలేదని మీ మరదలు కవితే చెప్పింది నిజం కాదా? కేబినెట్ విషయాలు వ్యక్తిగత దురుద్దేశాలతో బయటపెడుతున్నావు !
👉 మీరు పదేళ్లు “మేమే రాజులు – మేమే మంత్రులు” అంటూ పాలించారు.
ఇప్పుడు ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు.హరీష్ రావు, కేటీఆర్ లు ఇంకా రాజుల్లా ఫీల్ అవుతున్నారు !
👉 ప్రజలు డిసెంబర్ 2023లోనే మిమ్మల్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు నీ పార్టీ లేదు హరీష్ రావు నీ అయ్యా తరమూ లేదు.
ప్రజలు మీ పార్టీని పాతాళానికి నెట్టేశారు !
👉 మంత్రి వర్గాన్ని దండుపాళ్యం అంటావా?
అసలు ఈ రాష్టాన్ని దోచుకున్నది మీరే మీరు స్టువర్ట్‌పురం దొంగలకంటే మించిన బందిపోట్లు !
👉 కాలేశ్వరం అవినీతి, అసైన్‌డ్ భూముల కబ్జా, లిక్కర్ దందాలు ఇవన్నీ దండుపాళ్యం కంటే ఘోరమైన దోపిడీలు !
👉 ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఎందుకుందో ప్రజలందరికీ తెలుసు.మీరు దోచుకున్నదంతా న్యాయస్థానం ముందు బయటపడుతుంది !
👉 మా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారు మంత్రులను గౌరవిస్తున్నారు కేసీఆర్ లాంటి అధికారం దుర్వినియోగం లేదు !
👉 మా కేబినెట్‌లో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది.
మీరు ప్రగతిభవన్ గేట్ల దగ్గరే మంత్రులను నిలిపి పెట్టినవారు. మీ యాసతో అబద్ధాలకే శక్తి తెస్తున్నావు కానీ ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు.
👉 మేము ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేశాం మీ అప్పుల మధ్య కూడా అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తున్నాం !
👉 సీఎం రేవంత్ రెడ్డి మీద దురుద్దేశాలు ఆపాదించడం ఆపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సమానంగా చూసే ప్రభుత్వం మాది!
👉 నేను దళితుని, సాధారణ కార్యకర్త స్థాయి నుండి జిల్లా పరిషత్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎదిగాను.రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను !
👉 మంత్రి వర్గం, సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.లేకపోతే ప్రజలే సమాధానం చెబుతారు !
👉 ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాలో కామెంట్స్ !
మంత్రి వర్గాన్ని “దండుపాళ్యం” అని పిలిచిన కేటీఆర్, హరీష్ రావు మీరు బందిపోట్లు, దోపిడీదారులు!
👉 తెలంగాణ ఉద్యమ కారులమని చెప్పి ఇప్పుడు అదే రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారు.
👉 నాలుగు ఎస్సీలు ఉన్న కేబినెట్‌ను కించపరచడం దారుణం. దళిత ప్రజా ప్రతినిధులుగా హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
👉 సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చి, పాలనపై గ్రిప్ పెంచుతున్నారు ఆ స్వేచ్ఛ మీ పాలనలో ఎక్కడ ఉంది ?
👉 మీరు ఆటో కార్మికులను పట్టించుకోలేకపోయారు.
వారందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు వచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బావ–బామ్మర్దులు వీధి నాటకాలు ఆడుతున్నారు.
సొంత చెల్లిని పట్టించుకోని వారు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు !
👉 తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మీడియా సమావేశంలో కామెంట్స్ !
రేవంత్ రెడ్డి కలలోకే వస్తే కేటీఆర్–హరీష్ రావు లకు భయం వేస్తోంది BRS దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు హరీష్ రావే !
👉 2023లో గెలుస్తామని అనుకున్నారు
కానీ అసలైన మొగోడు రేవంత్ రెడ్డి గెలిచాడు
ఇప్పుడు పామ్ హౌస్ చుట్టూ దెయ్యాల్లా తిరుగుతున్నారు !
👉 దళిత బంధు చెక్కులు ఇచ్చి, వాటిని అమ్ముకున్నది మీ ఎమ్మెల్యేలే. కవిత జయలలిత అనుకుంటుంది కానీ అసలు శశికళలా మారింది !
👉 TRS పేరు మార్చి BRS పెట్టి దేశమంతా లిక్కర్ దందా చేసారు.మాల–మాదిగలు కలసి మీకు బొంద పెట్టారు ఇదే ప్రజా తీర్పు!
👉 ఎంపీ అనిల్ యాదవ్ మీడియా సమావేశంలో కామెంట్స్ !
సలీం పెక్ గాళ్లు కాంగ్రెస్ గురించి మాట్లాడే స్థాయి లేదు కేటీఆర్ “బైగాన్ బాత్” అన్నా — ఓడిపోయాక మీ బైగాన్ ఎక్కడుందో చూపిస్తాం!
👉 హైదరాబాద్ ప్రజలను మోసం చేస్తే, ప్రజల తీర్పు తప్పదు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి!
👉 వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మీడియా సమావేశంలో కామెంట్స్ !
హరీష్ రావు తాటి చెట్టు లాగా పెరిగి ఇప్పుడు మమ్మల్ని “దండుపాళ్యం” అంటున్నాడు మీరు డకైట్లు, రాబర్ బ్యాచ్ తెలంగాణ ప్రజలు మీ అసలు ముఖం చూశారు.
👉 లలిత్ మోడీ, విజయ్ మాల్యా కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడతారు దోచుకుని పారిపోవడం మీకు బాగా తెలుసు.
👉 పింక్ గొఱ్ఱెలు పామ్ హౌస్‌లో దాక్కుని అబద్ధాలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మా దళిత ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తారు !
👉 మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా సమావేశంలో కామెంట్స్ !
కేసీఆర్ కుటుంబం దోచుకుని రంగం చెప్పే పరిస్థితి లేదు. ఎస్సీల దళిత బంధు, బీసీల గొర్రెల పథకాలు అన్నీ దోపిడీ !
👉 గ్రూప్–1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, మైనారిటీలను మోసం చేశారు. రెండు ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసింది. కానీ మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు !
👉 నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశంలో కామెంట్స్ !
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్‌ను స్వీకరించకుండా పారిపోయిన హరీష్ రావు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి !
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించడానికి డ్రామాలు చేస్తున్నారు.
కానీ ఈ డ్రామాలు ఇక నడవవు !
