👉 సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బృందం వెల్లడి !
👉 స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో గురువారం జరిగిన సమావేశంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బృందం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
👉 ప్రపంచ పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకూ కేంద్రంగా నిలుస్తోన్న హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా, 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
👉 ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీమతి లారెన్ వుడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్ , హెడ్ లీగల్ కౌన్సిల్ జాసన్ షైయింగ్ గారు, HEX అడ్వైజరీ గ్రూప్‌కు చెందిన సార్థక్ బ్రహ్మ , రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
