హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లోటీయూడబ్ల్యూజే మద్దతుదారుల విజయం !

👉 జర్నలిస్టులకు కృతఙ్ఞతలు తెలిపిన విరాహత్ అలీ !


J. SURENDER KUMAR,

హోరా హోరీగా ఆదివారం జరిగిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికల్లో టీయుడబ్ల్యూజే మద్దతుతో పోటీ చేసిన ఫ్రెండ్స్ ప్యానెల్ అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ మీడియాతో మాట్లాడుతూ, విషసర్పాలన్నీ ఏకమై, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, చారిత్రాత్మక తీర్పుతో చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పి, ఫ్రెండ్స్  ప్యానెల్ మొత్తాన్ని అనూహ్య మెజారిటీతో గెలిపించుకొని, టీయూడబ్ల్యూజే పట్ల ఉన్న విశ్వాసాన్ని, అభిమానాన్ని చాటుకున్న హైదరాబాద్ జర్నలిస్టులకు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రెస్ క్లబ్ సభ్యుల విశ్వాసాన్ని వమ్ముచేయకుండా, వారి రుణాన్ని తీర్చుకోడానికి నిరంతరం కృషి చేస్తామని విరాహత్ అలీ హమీ ఇచ్చారు.