👉 మీడియా తో మాట్లాడుతున్న వీడియో ప్రచార సాధనాలలో వైరల్ ..
👉 మంత్రి అడ్లూరి ఆవేదన…..
J.SURENDER KUMAR,
“జరిగిన సంఘటనపై మీరు నన్ను నిన్న అడుగుతే ఓకే జెండా కింద పని చేస్తున్నాం, ఓసారి నాతో పొరపాటు జరగవచ్చు, బహుశా నన్ను కాదు అని మీకు చెప్పానా ? లేదా ? అంటూ ” మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా ప్రతినిధితో అన్నారు.
మంత్రి మీడియా ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడుతుండగా, మంత్రికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వారిలోఎవరో రికార్డ్ చేసి మంగళవారం ప్రచార మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది..
ఈరోజు 9 గంటల వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎవరు ఫోన్ చేసిన, నేను అనలేదు అని అంటున్నాడు అని లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా లక్ష్మణ్ కుమార్ ను అంటే పట్టించుకోను, కానీ ఈ మాటలు మా మాదిగ జాతి ఆత్మగౌరవం పై దాడీ అని మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధను వ్యక్తం చేశారు.

నాకు జరిగిన అవమానం గూర్చి సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యక్రమం నా శాఖకు సంబంధించింది. నేను కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కొన్ని నిమిషాలు ఆలస్యమైతే కార్యక్రమం కానివ్వండి, నేను వచ్చి జాయిన్ అవుతాను అని నిర్వాహకులకు చెప్పానని మంత్రి మీడియా ప్రతినిధికి ఇచ్చిన వివరణలో అన్నారు. కేవలం పది నిమిషాలు మాత్రమే ఆలస్యమైంది, మీరు నేను వచ్చిన టైం చూసుకోండి అంటూ మీడియా ప్రతినిధితో మంత్రి అన్నారు.
నేను సామాన్య కార్యకర్తను, కాంగ్రెస్ జెండా మోసి ఈ స్థాయికి వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు, మంత్రి వివేక్ అయిన, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలను ఖండించాల్సి ఉండేది అని అన్నారు. నేను వారి పక్కన కూర్చుంటే వారికి గిట్టడం లేదు. నేను ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడే వాడిని కాదు, సామాన్యుడిని. మాదిగ కోట కిందనే నాకు మంత్రి పదవి వచ్చింది అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వర్గీకరణ ప్రక్రియ నాటి నుంచి, మంత్రి వివేక్ మమ్మల్ని టార్గెట్ చేశాడు. నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, వారి నాన్నతో మా తండ్రికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మంత్రి కుమారుడు వంశీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలవడంలో నా వంతు కృషి పాత్ర ఉందంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్, బాధను వ్యక్తం చేశారు.
ఈ విషయంపై నేను మా పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు, అధ్యక్షుడికి ఫిర్యాదు చేశానన్నారు. మా పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలసి జరిగిన అవమానం
వివరిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
జరిగిన సంఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్, సరి అయిన పద్ధతిలో స్పందిస్తారని ఆశిస్తున్నాను. ఇదే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తే జరగబోయే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని. మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా ప్రతినిధితో మాట్లాడిన మాటలు ప్రచార మాధ్యమాల్లో విస్తృతస్థాయిలో వైరల్ అవుతున్నాయి..