జగిత్యాల మున్సిపాలిటికి  62 కోట్ల నిధులు !

👉 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు ₹ 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం ఆనంద దాయకం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.

👉 జగిత్యాల పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు..

దీపావళి సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అభివృద్దికి నిధులు కోరాము.
₹ 62 కోట్ల పైన నిధులు మంజూరు చేశారు. 8 ప్యాకేజీ లలో ప్రతిపాదనలు పంపాలని కోరడం జరిగింది. అర్బన్ హౌసింగ్ కాలనీ కోసం ₹ 20 కోట్లు నిధులకు ప్రపోజల్స్ పంపడం జరిగింది..

👉 2023లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల అభివృద్ది పనుల కోసం వినతి పత్రం అందజేశాను అదే రోజు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ చివరి వారంలో ₹32 కోట్ల నిధులు మంజూరు కావడంతో కరెంట్, డ్రైనేజీ వివిధ అభివృద్ది పనులు చేపట్టాం

👉 అమృత్ స్కీమ్ లో మంచి నీటి సరఫరా కార్యక్రమం చేపట్టాం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాల లో విలీనం చేశాం.
నాడు నేడు నిరంతరం జగిత్యాల అభివృద్ధి కి ప్రతిపాదనలు పంపిస్తున్నాం.

👉 జగిత్యాల పట్టణం జిల్లా కు గుండెకాయ వంటిది. ముఖ్యమంత్రి కి జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు అన్నారు.

👉 జగిత్యాల విస్తీర్ణం పెరిగేలా ధరూర్, తిప్పన్నపెట్, లింగం పెట్, హస్నాబాద్ మోతే, టిఆర్ నగర్, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనిల్లోని శివారు ప్రాంతాలను సర్వే నంబర్ లను కలపడం వల్ల ప్రభుత్వ స్థలం కూడా పెరిగింది.

👉 రైతులకు నష్టం కాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి, భవిష్యత్ తరాలకు అనుగుణంగా విస్తరిస్తాం వచ్చే ఎన్నికల కోసం కాదు వచ్చే తరం గురించి పని చేయాలి…

👉 డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉంటే తెలపాలి…డ్రాఫ్ట్ ఒకే అయితే మాస్టర్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది.

👉 యావర్ రోడ్డు విస్తరణ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. విస్తరణకు తన వంతుగా కృషి చేస్తా అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం సహకారం ఉండాలి…

👉 జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తా..అసాధ్యం అనుకున్న పనులకు ప్రజలు అధికారులు మంత్రులు ముఖ్య మంత్రి సహకారం తో సాధ్యం చేయటం జరిగింది..

👉 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లతో కలిసి జగిత్యాల అభివృద్ధి..జిల్లా కేంద్రం గా మూడు జాతీయ రహదారులు మంజూరు అయ్యాయి. పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రోళ్లవాగు కూడా చివరి దశలో ఉంది.

👉 డ్రైనేజీ రోడ్లు కరెంట్ వసతుల కల్పన కు అత్యంత ప్రాధాన్యత..₹140 కోట్ల తో జగిత్యాల పట్టణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా పూర్తి అవుతాయి.

👉 ప్రభుత్వ స్థలాలు ఎవరూ అక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అభివృద్దికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ కు ప్రత్యేక ధన్యావాదాలు అన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ , నాయకులు బాలే శంకర్, డిష్ జగన్, కుసరి అనిల్, చెట్పల్లి సుధాకర్. గుర్రం రాము, చందా పృథ్వీ, పిట్ట ధర్మరాజు, జంబర్తి రాజ్ కుమార్, శ్రీనివాస్, అహమ్మద్, పెద్దింటి రాజు ఆరుముల్ల పవన్, ప్రబాత్ సింగ్ ఠాగూర్, పోతునుక మహేష్,  రంగు మహేష్, యంఏ ఆరిఫ్, ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.