J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలోని సర్వేనెంబర్ 138 పెట్రోల్ పంప్ స్థలం పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవము అని మంచాల కృష్ణ అన్నారు.
జగిత్యాలలో మంగళవారం మంచాల కృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పత్రిక ప్రకటన విడుదల చేశారు.
మా తాత దారం వీరమల్లయ్య 1952లో సర్వే నెంబర్138లో 20 గుంటల స్థలము మున్సిపాలిటీ నుండి ₹ 2000 రూపాయలకు “కిబాలా “ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. తరువాత రెవిన్యూ రికార్డులో నమోదు చేయడం జరిగింది.
మున్సిపల్ అధికారులు ఈస్థలముపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలతో మున్సిపల్ తీర్మాణం చేసినపుడు ఈ స్థలం యజమానులుగా హై కోర్టు లో కేసు వేయడం జరిగింది.

హైకోర్టు లో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి గారు ఈ స్థలం యొక్క భూ యాజమాన్యం హక్కులను నిరూపించుకోవాలని స్థలం యజమానులమైన మమ్మల్ని ఆదేశించడం జరిగింది.
పై ఆదేశాలమేరకు హై కోర్టు లో డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకోవడం జరిగింది. 16-12-2008 55 no. 1650/2008 2 1664/2008 ” తీర్మానాన్ని setaside చేయడం జరిగింది.
2005లోని W.P.No. 1623 మరియు 2604 లలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉమ్మడి తీర్పును setaside చేశారు.మరియు తత్ఫలితంగా 2వ ప్రతివాది – 30.11.2004న మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానం నెం.140ని setaside
మరియు పైన పేర్కొన్న రెండు రిట్ పిటిషన్లకు సంబంధించినంతవరకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయకూడదని హై కోర్ట్ డివిజన్ బెంచ్ తేది 16-12-2008 న తీర్పును ఇవ్వడం జరిగింది.
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పత్రికల వారి ముందు సర్వే నెంబర్138 పెట్రోల్ పంప్ కి సంబంధించి చేసిన ప్రకటనలు అసత్యమని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము అని విడుదల చేసిన ప్రకటనలు కృష్ణ పేర్కొన్నారు.
