జర్నలిస్టు సమస్యలపై మంత్రితో మీడియా చైర్మెన్ శ్రీనివాసరెడ్డి !

J.SURENDER KUMAR,

ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమ అంశాలపై సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డితో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి చర్చించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హరిప్రియ తో నూతన అక్రిడేషన్ కార్డుల జారీ, హెల్త్ కార్డులు, జర్నలిస్టుల అవార్డులు, దాడుల కమిటీ నియామకం, ఇళ్ల స్థలాల, తదితర పెండింగ్ అంశాలపై చర్చించినట్లు సమాచారం.