కాశి క్షేత్రంలో వైభవంగా ధర్మపురి నరసింహుడి కళ్యాణం !

J.SURENDER KUMAR,

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశి క్షేత్రం  (ఉత్తరప్రదేశ్ వారణాసి) లో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది.

పరాశర వైదికాగమవేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో గల ” వారణాసి “కాశీ విశ్వనాథ్ మందిరం ప్రాంగణం శ్రీ త్రియంబకేశ్వర హల్ లొ కళ్యాణ మహోత్సవం సాయంత్రం ధర్మపురి ఆలయ వేద పండితులు అర్చకులచే అత్యంత వైభవంగా నిర్వహించారు.


ఈ కళ్యాణ మహోత్సవంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్, అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్, నంబి అరుణ్ కుమార్ బొజ్జ రాజగోపాల్ పాల్గొన్నారు.