👉 రోజు లక్ష రూపాయలకు పైగా ఆదాయం !
J.SURENDER KUMAR,
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి 81 రోజుల హుండీ ఆదాయం ₹1,08,72,591/- ( కోటి ఎనిమిది లక్షల 72, వేల 591) వచ్చింది. ఈ లెక్కన స్వామివారికి ప్రతిరోజు లక్ష రూపాయలకు పైగా భక్తులు హుండీ లో కానుకలు సమర్పించారు.
కార్యనిర్వహణాధికారి & ఉప కమీషనర్, శ్రీకాంత్ రావు ఆధ్వర్యములో సోమవారము శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్, కరీంనగర్ వారిచే (12) హుండీలు ( 81 ) రోజులకు గాను విప్పి లెక్కించారు. ఇందులో మిశ్రమ వెండి, బంగారము తిరిగి బ్యాగ్ లో వేసి సీల్ చేసి హుండీలో భద్రపరచనైనది. విదేశీ కరెన్సీ (55) నోట్లు వచ్చాయి. హుండీ లెక్కింపు శ్రీమతి యన్ సుప్రియ సహాయ కమీషనర్, దేవాదాయ శాఖ, కరీంనగర్, రాజమోగిలి, పరిశీలకులు దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పర్యవేక్షణలో నిర్వహించారు.

పర్యవేక్షకులు దేశిని సునీల్ కుమార్, నీల చంద్రశేఖర్, గుండి హరిహరనాత్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు ఆలయ సిబ్బంది,ఏ.ఎస్.ఐ, మహిళాకానిస్టేబుల్, హెూంగార్డ్స్, బ్యాంక్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.