క్రీడాకారిణి జీవాంజి దీప్తిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

వర్టూస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ -2025 పోటీల్లో మహిళల విభాగం 400 మీటర్ల(టీ20) పరుగు పందెంలో సత్తా చాటి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి ని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అభినందించారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన వర్టూస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో రికార్డు సమయంలో 55.92 సెకన్లలో లక్ష్యం చేరుకుని స్వర్ణం సాధించిన దీప్తి మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలంగాణ కీర్తిని చాటారని ప్రశంసించారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ఆమె భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి  ఆకాంక్షించారు.