మాదిగలకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి !

👉 24, గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలు !

👉 ఎమ్మార్పీఎస్, డిమాండ్ !

J.SURENDER KUMAR,

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తన సహచర మంత్రి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను  కించపరిచే విధంగా అనుచితంగా వ్యాఖ్యానించడం పట్ల మాదిగలకు మంత్రి పొన్నం 24 గంటల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)  డిమాండ్ చేసింది.

ధర్మపురి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, చెందోలి శ్రీనివాస్, నాయకులు మాట్లాడుతూ..
హైదరాబాద్ లోని “జూబ్లీహిల్స్” లో ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశం లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాదిగల ఆత్మగౌరవాన్ని  దెబ్బతీసే విధంగా సహచర మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ ను కించపరిచే విధంగా మాట్లాడడాన్ని వారు ఖండించారు.

24, గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే “పద్మ శ్రీ” మందకృష్ణ మాదిగ, ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మంత్రి పొన్నం, దిష్టిబొమ్మను దహనం చేసి కార్యాలయాన్ని  ముట్టడిస్తామని వారు విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.


మాదిగలకు, డబ్బులు, పదవుల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తక్షణమే మంత్రి పొన్నం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ పట్టణం అధ్యక్షులు పులి ప్రేమిత్ , ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాయిల్ల రవి కుమార్ , బత్తిని నరేష్, మోదిగం శ్రీనివాస్, ఉరడి శంకర్ తదితరులు పాల్గొన్నారు.