మాజీ మంత్రి రాంరెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం !

J.SURENDER KUMAR,

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.  అయిదు సార్లు శాసనసభ సభ్యుడిగా దామోదర్ రెడ్డి  నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.

దామోదర్ రెడ్డి  లేని లోటు పూడ్చలేనిదని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ముఖ్యమంత్రి  సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరో ప్రకటనలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి రామ్ రెడ్డి మృతి పట్ల  సంతాపం వ్యక్తం చేశారు.