👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
మాజీ మంత్రి కాక వెంకటస్వామి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికే తన రాజకీయ జీవితం అంకితం చేశారు అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ .గడ్డం కాక వెంకటస్వామి జయంతి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
👉 అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మాట్లాడుతూ..
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఆయన చూపిన కృషి అమోఘం. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారార్థం ఆ సమయంలో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు ను కలసి నిధులు సమకూర్చి వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు అని అన్నారు.

అలాగే హైదరాబాద్‌లో గుడిసెలలో నివసిస్తున్న సుమారు 70 వేల నిరుపేద కుటుంబాలకు గృహపట్టాలు మంజూరు చేయించడం ఆయన గొప్ప సేవ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి విరాళాలు తీసుకోకుండా స్వంత నిధులతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్మాణానికి తోడ్పడిన అరుదైన నాయకుడు కాక వెంకటస్వామి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.