👉 మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ !
J.SURENDER KUMAR,
మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధుల ఆరోగ్య భీమా పథకానికి సంబంధించి నగదు రహిత (Cashless) వైద్య సేవలను అందించాలన్న అంశంపై బుధవారం హైదరాబాదు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తాన్ ను మాజీమంత్రి రాజేశం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు.
మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని సందీప్ కుమార్ సుల్తాన్ ను కోరారు.
ఈపథకం ద్వారా సమయానుకూలంగా మెరుగైన వైద్య సేవలు పొందగలుగుతారని, ఇది మానవతా దృక్పథంలో కూడా ఎంతో అవసరమని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి రాజేశం గౌడ్ వివరించారు. మాజీ మంత్రి, సంఘం కార్యదర్శి సుద్దాల దేవయ్య, మాజీ విప్ ఆరెల్లి మోహన్, సందీప్ కుమార్ సుల్తాన్ ను కలిసిన వారిలో ఉన్నారు.
.
